For Money

Business News

షియోమి, ఒప్పొపై రూ.1000 కోట్ల ఫైన్‌?

చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు భారీ ఎత్తున పన్నును ఎగవేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, అస్సామ్‌, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, గుజారత్‌, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్‌ దేశాలలో ఈ కంపెనీలకు చెందిన ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు నిర్వమించారు. రాయల్టీ పేరుతో విదేశాల్లో ఉన్న తమ మాతృసంస్థలకు ఈ కంపెనీలు రూ. 5,500 కోట్లు తరలించినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కంపెనీలు నిధులు తరలించినట్లు గుర్తించారు. ఐటీ చట్టం కింద ఈ కంపెనీలపై రూ. 1000 కోట్ల ఫైన్‌ వేసేందుకు వీలుందని ఐటీ అధికారులు తెలిపారు.