For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు చాలా వరకు లాభాలు కోల్పోయినా.. లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌ 0.8 శాతం లాభంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలు పరిమితంగా ఉన్నాయి. చైనా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. డాలర్‌ పెరుగుతుండటంతో మెటల్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది. హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ మార్కెట్లు ఒకశాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి 60 పాయింట్ల లాభంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి కూడా స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది.