For Money

Business News

నిఫ్టి టుడే: డబుల్‌ గేమ్‌

నిఫ్టి ఇవాళ కూడా నిన్నటి మాదిరి స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది. విచిత్రమేమిటంటే… నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి 15,830 ప్రాంతంలోనిఫ్టి ఓపెన్‌ కావడం. వెంటనే నిఫ్టి 15,845-15850 ప్రాంతానికి చేరే అవకాశముంది. ఓపెనింగ్‌లో మద్దతు లభిస్తే 15,870 వరకు వెళుతుందేమో చూడండి. లేకుంటే ఇదే స్టాప్‌లాస్‌తో అమ్మండి. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 15,800. ఈ స్థాయిపైన ఉన్నంత వరకు నిఫ్టికి డోకా లేదు. దిగువకు వస్తే మాత్రం 15,720 వరకు మద్దతు లేదు. మధ్య నిలదొక్కుకుంటుందా అన్నది అనుమానమే. ఒకవేళ నిఫ్టి గనుక 15,750 దిగువకు వస్తే కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్‌ 15,700. ఈ స్థాయికన్నా దిగువకు వచ్చినా… 15,870 దాటినా మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. సింపుల్‌గా 15,850పైన అమ్మడం, 15,750లోపల కొనుగోలు చేయడం. పొజిషన్‌ ఏదైనా స్వల్ప లాభాలతో సంతృప్తి పడండి. ఎందుకంటే నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్స్‌లో ఉన్నా… స్వల్ప కాలిక టెక్నికల్‌ సంకేతాలు కొనుగోలు సంకేతాలు ఇస్తున్నాయి.