For Money

Business News

నిఫ్టి: లాభాల స్వీకరణ

ఉదయం అంచనా వేసినట్లు నిఫ్టి నిన్నటి గరిష్ఠ స్థాయి వద్దే క్లోజైంది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమై… ఒకదశలో 15,895ని దాటింది. అంటే రెండు టెక్నికల్‌ అవరోధాలను దాటింది. కాని మూడో అవరోధాన్ని దాటేలోపు లాభాల స్వీకరణ కారణంగా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ఉదయం అనుకున్నట్లు మార్కెట్‌కు యూరో మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. పైగా అమెరికా ఫ్యూచర్స్‌ కూడా లాభాలన్నీ కోల్పోయి నష్టాల్లో జారుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మెజారిటీ యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే సరికి నిఫ్టిలో లాభాల స్వీకరణ వచ్చింది. మిడ్‌ సెషన్‌ వరకు ఒక మోస్తరు లాభాల్లో ఉన్న నిఫ్టి, క్లోజింగ్‌ సమయానికి దాదాపు ఉదయపు లాభాలన్నీ కోల్పోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి కేవలం 26 పాయింట్ల లాభంతో 15,772 వద్ద ముగిసింది. ఇవాళ గరిష్ఠ స్థాయి 15,895తో పోలిస్తే నిఫ్టి 140 పాయింట్లు క్షీణించి 15,752 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరడంతో షార్ట్‌ చేసిన డే ట్రేడర్లకు మంచి లాభాలను ఇచ్చింది. నిఫ్టి ఒకేదిశలో పయనించడం వల్ల కేవలం షార్ట్‌ చేసినవారికే ఇవాళ లాభాలు పరిమితమయ్యాయి. నిఫ్టి గ్రీన్‌లో క్లోజ్‌ అయినా… మిడ్‌ క్యాప్‌తో పాటు బ్యాంక్‌ నిఫ్టి కూడా నష్టాల్లో ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

మారుతీ 7,257.50 5.18
యూపీఎల్‌ 802.00 3.86
శ్రీ సిమెంట్‌ 29,161.15 3.32
విప్రో 556.70 2.68
ఎస్‌బీఐ లైఫ్‌ 1,005.00 2.39

నిఫ్టి టాప్‌ లూజర్స్
ఏషియన్‌ పెయింట్స్‌ 3,015.00 -1.75
బజాజ్‌ ఫైనాన్స్‌ 6,018.00 -1.60
నెస్లే ఇండియా 17,430.00 -1.24
హిందుస్థాన్‌ లీవర్‌ 2,487.00 -1.09
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 999.00 -0.85