For Money

Business News

జెట్‌ ఎయిర్‌లైన్స్‌ టేకోవర్‌కు NCLT ఓకే

జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ టేకోవర్‌ చేసేందుకు లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న కాల్‌రాక్‌ క్యాపిటల్‌, యూఏఈకి చెందిన మురారీ లాల్ జలాన్‌లు సమర్పించిన బిడ్‌కు నేషనల్‌ కంపెనీస్‌ లా ట్రైబ్యూనల్‌ (NCLT) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు 90 రోజుల్లోగా స్లాట్‌లను కేటాయించాల్సిందిగా పౌర విమానయాన శాఖ, సివిల్ ఏవియేషన్‌ డైరెక్టర్‌జనరల్‌కు ఆదేశాలు ఇచ్చింది. కొత్త ప్రమోటర్లు రానున్న అయిదేళ్ళలో ఈ కంపెనీలో రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 30 విమనాలతో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా ఎయిర్‌పోర్టు మారనుంది. 120 విమానాలతో నంబర్‌ వన్‌ కంపెనీ గా ఉన్న జెట్‌ ఎయిర్‌ వేస్‌ 2019 ఏప్రిల్‌లో దివాలా తీసింది.