For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు వారాంతపు రికవరీతో ముగిశాయి. వారమంతా భారీగా నష్టపోయిన నాస్‌డాక్‌ రెండు శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఇతర సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియామార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి… జపాన్‌ తప్ప. నిక్కీ 1.2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇతర సూచీలు ముఖ్యంగా చైనా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ మాత్రం అర శాతం లాభానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 56 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా దే స్థాయి లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గడం మార్కెట్‌కు పాజిటివ్‌. అయితే కార్పొరేట్‌ ఫలితాల ప్రభావం మార్కెట్‌పై ఉండే అవకాశముంది. 14700పైన నిఫ్టి ప్రారంభం కానుంది. తొలి ప్రధాన నిరోధం 14,760 వద్ద ఎదురు కానుంది.