For Money

Business News

SELL నిఫ్టి, నిఫ్టి బ్యాంక్‌

మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్‌ మూడ్‌ చూస్తుంటే నిఫ్టి 14700పైన ప్రారంభం కానుంది. నిఫ్టి గనుక 14780ని దాటితే అమ్మమని సలహా ఇస్తున్న రిలగేర్‌ బ్రోకింగ్‌కు చెందిన మనోజ్‌ మురళీధరన్‌ సలహా ఇస్తున్నారు. సీఎన్‌బీసీ టీవీ 18తో ఆయన మాట్లాడుతూ నిఫ్టిని 14780-14800 మధ్య అమ్మమని సలహా ఇస్తున్నారు. 14,870 స్టాప్‌లాస్‌తో 14,650 టార్గెట్‌ కోసం అమ్మమని ఆయన సలహా ఇస్తున్నారు. అలాగే ఆప్షన్స్‌లో నిఫ్టి బ్యాంక్‌ను అమ్మమని ఆయన సలహా ఇస్తున్నారు. 32,200 మే నెల కాంట్రాక్ట్‌ను రూ. 80 స్టాప్‌లాస్‌తో రూ. 200 వద్ద అమ్మని సలహా ఇస్తున్నారు. టార్గెట్‌ రూ. 340.