For Money

Business News

BUY & SELL: బాటా ఇండియా

మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. అధిక స్థాయిల వద్ద ముఖ్యంగా 14760 వద్ద ప్రతిఘటన ఖాయమని అంటున్న సమయంలో డే ట్రేడర్లకు బాటా ఇండియా షేర్లను టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ షేర్‌ను పొజిషనల్‌ ట్రేడింగ్‌కు కూడా కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. ప్రముఖ టెక్నికల్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని ఈ షేర్‌ను రూ. 1,370 స్టాప్‌లాస్‌తో రూ. రూ. 1410 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 1386 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఎల్‌ అండ్‌ టీని కూడా రూ.1435 టార్గెట్‌ కోసం రూ. 1395 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 1,415వద్ద ట్రేడవుతోంది.