For Money

Business News

బ్యాంకుల అండతో నిఫ్టి జూమ్‌

నిఫ్టి తన మొదటి ప్రతిఘటనను ఇవాళ సునాయాసంగా దాటింది. సరిగ్గా రెండో ప్రతిఘటన వద్ద ముగిసింది. నిఫ్టికి ఇవాళ ఓపెనింగ్‌లో 14,725 వద్ద మద్దతు అందింది. ఆరంభంలో డల్‌గా ఉన్న నిఫ్టి 14,760 అంటే తొలి ప్రతిఘటన స్థాయిని ఈజీగా దాటడంతో మార్కెట్‌ చివరి వరకు మద్దతు కొనసాగుతూ వచ్చింది. కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు దిగువకు రావడంతో సెంటిమెంట్‌ బలపడింది. బ్యాంకులు, ఫైనాన్షియల్స్‌తో పాటు మెటల్స్‌కు గట్టి మద్దతు లభించింది.దీంతో మిడ్‌ సెషన్స్‌లో యూరో మార్కెట్లు నిస్తేజంగా ఉన్నా నిఫ్టి పట్టించుకోలేదు. 245 పాయింట్ల లాభంతో 14,923 వద్ద ముగిసింది. నిఫ్టి రెండో ప్రధాన నిరోధం 14,950. మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా 1.87 శాతం లాభంతో ముగిశాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 958.00 7.54
ఎస్‌బీఐ 384.45 6.66
ఐసీఐసీఐ బ్యాంక్‌ 623.90 4.45
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,439.00 3.76
యాక్సిస్‌ బ్యాంక్‌ 708.65 3.45

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
సిప్లా 883.45 -2.28 1,41,20,933
భారతీ ఎయిర్‌టెల్‌ 547.80 -2.25
ఎల్‌ అండ్‌ టీ 1,388.40 -1.91
ఎస్‌బీఐ లైఫ్‌ 964.70 -1.40
నెస్లే ఇండియా 17,060.00 -0.95