For Money

Business News

15,000పైన ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా… ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికాలో నాస్‌డాక్‌ ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనైనా తరవాత నష్టాలను తగ్గించుకుంది. మార్కెట్లు నామ మాత్రపు నష్టాలతో ముగిశాయి. కరోనా కేసుల కారణంగా ఇటీవల తీవ్ర ఒత్తిడికి లోనైన తైవాన్ మార్కెట్లు దాదాపు 4 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ సూచీ కూడా 2శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. చైనా నష్టాల్లో ఉన్నా నామమాత్రమే.ఇండియా మార్కెట్లు సాధారణంగా ఫాలో అయ్యే హాంగ్‌సెంగ్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం167 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా 15000పైన ప్రారంభమయ్యే అవకాశముంది.