For Money

Business News

డాలర్‌ దెబ్బకు వాల్‌స్ట్రీట్‌ ఢమాల్‌

నాస్‌డాక్‌ మరోసారి రెండు శాతంపైగా క్షీణించింది. టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వొస్తోంది ఇటీవల. ద్రవ్యోల్బణ రేటు పెరగడంతో వడ్డీ రేట్ల పెంపు ఖాయమని అమెరికా మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇవాళ డాలర్‌ ఏకంగా 0.6 శాతంపైగా పెరిగింది. దీంతో టెక్‌ షేర్లతో పాటు డౌజోన్స్‌ కూడా ఒక శాతంపైగా క్షీణించింది. టెక్‌ షేర్ల దెబ్బకు ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా 1.4 శాతం క్షీణించింది. డాలర్‌ పెరగడంతో బులియన్‌ మార్కెట్‌లో ఒత్తిడి కన్పించింది. బంగారం కన్నా వెండిలో అమ్మకాలు అధికంగా ఉన్నాయి.