For Money

Business News

మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఎక్కడో తెలుసా?

భారత దేశంలో తమ కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడిచింది.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్‌కు మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, తెలంగాణ ఐటీ శాక మంత్రి కేటీఆర్‌ ఈ ఒప్పందం జరిగింది. మైక్రోసాఫ్ట్‌ తరఫున ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌ జీన్‌ ఫిలిప్‌ కర్టిస్‌, మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి పాల్గొన్నారు. రానున్న 15 ఏళ్ళలో హైదాబాద్ డేటా సెంటర్‌పై కంపెనీ రూ. 15000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌ శివార్లలోని చందనవెల్లి, ఎల్లికట్ట, కొత్తూర్‌ ప్రాంతాలలో ఈ కొత్త డేటా సెంటర్‌ను నెలకొల్పుతారు. మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే పుణె, ముంబై, చెన్నైలలో డేటా సెంటర్లు ఉన్నాయి.