For Money

Business News

మాంద్యం అంచున ప్రపంచం

ప్రపంచం మొత్తం ప్రస్తుతం మాంద్యం వైపు పయనిస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ నెగోజి ఒకోంజో ఇవేలా హెచ్చరించారు. జెనీవాలో డబ్ల్యూటీవో వార్షిక పబ్లిక్ ఫోరంను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. వృద్ధి రేటును పెంచేందుకు విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, వాతావరణ సంక్షోభం, ఆహార ధరలు, ఇంధన కొరత, కొవిడ్ అనంతర పరిణామాలు.. ఇవన్నీ మాంద్యానికి కారణమని ఆయన అన్నారు. ప్రధానంగా ఆహార భద్రత పెద్ద ముప్పుగా మారనుందని ఆమె హెచ్చరించారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఈ రెండూ ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. బ్యాంకులూ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని డబ్ల్యూటీవో చీఫ్‌ పేర్కొన్నారు. ‘సెంట్రల్ బ్యాంకులకు వడ్డీ రేట్లను మరింత పెచండం మినహా ఎక్కువ అవకాశాలు లేవన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.