For Money

Business News

పబ్లిక్‌ ఇష్యూకు రానున్న గో ఎయిర్‌

వాడియా గ్రూప్‌నకు చెందిన గో ఎయిర్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. కరోనా కారణంగా ఏవియేషన్ రంగం కష్టాల్లో ఉన్న పబ్లిక్ ఇష్యూకు రావాలని గో ఎయిర్‌ నిర్ణయించింది. ఈవారంలోనే ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేయనుంది. ఐపీఓ ద్వారా రూ.3,600 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ మొత్తం అంతా కొత్త ఈక్విటీ ద్వారా సమీకరిస్తారు. అంటే ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఎవరూ తమ వాటాను ఈ ఇష్యూలో అమ్మడం లేదు. ఇష్యూ ద్వారా వచ్చే మొత్తంలో చాలా భాగం ఇపుడున్న రుణాలను తీర్చడానికి కంపెనీ ఉపయోగించనుంది. గత మార్చి నెలాఖరు నాటికి కంపెనీకి ఉన్న మొత్తం రుణాల విలువ రూ. 1,780 కోట్లు. మిగిలిన మొత్తాన్ని కంపెనీ వృద్ధి కోసం ఉపయోగిస్తారు. వాడియా గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కంపెనీలైన బాంబే డైయింగ్‌, బాంబే బర్మా ట్రేడింగ్‌, బ్రిటానియాలకు గో ఎయిర్‌లో ఎలాంటి వాటాలు లేవు.