For Money

Business News

భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరిన డౌ జోన్స్ క్లోజింగ్‌ కల్లా లాభాలు కోల్పోయింది. నాస్‌డాక్‌ ఏకంగా 2.2 శాతం నష్టపోయింది. దీని ఎఫెక్ట్‌ ఎస్‌ అండ్‌ పీ 500పై కూడా పడింది. ఈ సూచీ కూడా నష్టాల్లో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా జపాన్‌ నిక్కీ మూడు శాతం వరకు నష్టంతో ట్రేడవుతోంది. హాంగ్‌సెంగ్‌, చైనా మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌కాంగ్‌ 2 శాతంపైగా క్షీణించడం… భారత్‌ మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చు. సింగపూర్ నిఫ్టి 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా భారీ నష్టాలతో ప్రారంభం కానుంది.