For Money

Business News

ఇపుడు ఇథీరియం వంతు

క్రిప్టో కరెన్సీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బిట్‌కాయిన్‌. ఈ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న బిట్‌కాయిన్‌ 60,000 డాలర్లను తాకిన తరవాత ఇపుడు 58,087 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీని తరవాత రెండో స్థానంలో ఉన్న ఇథీరియంకు ఇటీవల డిమాండ్‌ పెరుగుతోంది. బిట్‌కాయిన్‌ ఇప్పటికే బాగా పెరిగినందున… సంస్థాగత ఇన్వెస్టర్లు ఇపుడు ఇథీరియంపై దృష్టి పెట్టారు. దీంతో క్రమంగా పెరుగుతూ వచ్చిన ఇథీరియం ఇవాళ 4000 డాలర్లను దాటింది. 5.2 శాతం పెరిగి ఇపుడు 4056 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.