For Money

Business News

నిఫ్టి: దిగువస్థాయిలో మద్దతు

నిఫ్టి ఇవాళ ప్రారంభమైన కొద్దిసేపటికే మద్దతు స్థాయికి చేరింది. ఇవాళ్టి ఇంట్రా డే ట్రేడింగ్‌కు తొలి మద్దతు స్థాయి 15,650 కాగా, 15,648ని దాటాక నిఫ్టి క్రమంగా పెరుగుతూ వచ్చింది. కాస్త హెచ్చతుగ్గులకు లోనైనా.. చివరిదాకా లాభాల్లో కొనసాగింది. ఇవాళ్టి ప్రధాన ప్రతిఘటన స్థాయి 15,750ని తాకింది. కాని క్లోజింగ్‌లో 15,737 వద్ద ముగిసింది. దాదాపు వంద పాయింట్ల రేంజ్‌లో నిఫ్టి కదలాడింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి వంద పాయింట్లు లాభపడింది. అయితే అసలు ట్రేడింగ్‌ మిడ్‌ క్యాప్‌ షేర్లలో సాగింది. నిఫ్టి నెక్ట్స్‌-50 సూచీ 1.22 శాతం పెరగ్గా, మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ 1.6 శాతం పెరిగింది. బ్యాంకు షేర్లతో పాటు ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల సూచీలకు గట్టి మద్దతు లభించింది. నిఫ్టిలో 34 షేర్లు లాభాల్లో ముగిశాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్
బజాజ్‌ ఫైనాన్స్‌ 6,109.80 7.67
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 12,000.00 3.82
ఎస్‌బీఐ 432.40 2.60
దివీస్‌ ల్యాబ్‌ 4,371.00 2.43
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,025.10 2.15

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఆటో 4,184.00 -0.96
ఐషర్‌ మోటార్స్‌ 2,709.00 -0.73
యూపీఎల్‌ 839.95 -0.66
అదానీ పోర్ట్స్‌ 848.30 -0.50
శ్రీసిమెంట్‌ 28,287.95 -0.42