For Money

Business News

కీలక స్థాయిలో నిఫ్టి ప్రారంభం

నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 15660. ఓపెనింగ్‌లోనే ఈ స్థాయిని తాకిన నిఫ్టి 15,696కి చేరింది. ఇపుడు 15,679 పాయింట్ల వద్ద 44 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 40 షేర్లు గ్రీన్లో ఉన్నా… నిఫ్టి పరిమిత లాభాలతో ఉంది. అంటే అన్నీ నామ మాత్రపు లాభాల్లో ఉన్నాయన్నమాట. అయితే అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ 1.5 శాతంలోపు తగ్గాయి. దీంతో చాలా మంది అమెరికా మార్కెట్ల వైపు ఎదురు చూస్తున్నాయి. నిఫ్టి ఏమాత్రం తగ్గినా కొనుగోలు చేయమని టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. అయితే ఏ స్థాయిలో కొనుగోలు చేయాలనేది ఇన్వెస్టర్ల రిస్క్‌ టేకింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. నిఫ్టి ఒకవేళ బలహీనమైతే 15,600ని తాకే అవకాశాలు ఉనాన్నాయి. 15,600-15,650 మధ్య మద్దతు వస్తుందేమో చూడాలి. నిఫ్టికి అధికస్థాయిలో ఒత్తిడి వస్తున్నా… భారీ అమ్మకాలు మాత్రం లేవు. మిడ్‌ క్యాప్‌ షేర్లు సూచీ ఏకంగా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇపుడు ట్రేడింగ్‌ చాలా వరకు స్మాల్‌క్యాప్ షేర్లలో కేంద్రీకృతమైంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
JSW స్టీల్‌ 709.40 1.66
టాటా కన్జూమర్‌ 708.70 1.42
పవర్‌గ్రిడ్‌ 245.50 1.40
టాటా స్టీల్‌ 1,115.70 1.34
శ్రీ సిమెంట్‌ 28,778.80 1.31

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఓఎన్‌జీసీ 123.35 -0.56
బ్రిటానియా 3,557.25 -0.49
ఐసీఐసీఐ బ్యాంక్‌ 633.80 -0.36
యాక్సిస్‌ బ్యాంక్‌ 734.25 -0.34
బజాజ్‌ ఆటో 4,210.55 -0.33