For Money

Business News

దిగువస్థాయిలో నిఫ్టి ప్రారంభం

దాదాపు క్రితం స్థాయిలో నిఫ్టి ప్రారంభమైనా.. క్షణాల్లో 15,735కి పడింది. నిఫ్టికి ప్రధాన మద్దతు స్థాయిల 15700-15,730. 15,735 నుంచి నిఫ్టి కోలుకుని ఇపుడు 15,759 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపు పోలిస్తే 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.పైకి సూచీలు స్థిరంగా ఉన్నట్లు కన్పించినా.. వాస్తవానికి మార్కెట్‌ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీ స్వల్ప లాభాలతో నిఫ్టిని కాపాడుతోంది. నిఫ్టిలో ఏకంగా 36 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ 0.8 శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్‌ 50 ఒక శాతంపైగా నష్టపోయింది. సో… ఇన్వెస్టర్లు అనేక షేర్లలో లాభాలు స్వీకరిస్తున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూసే అవకాశముంది. అలాగే అనేక మంచి షేర్లు ఇపుడు ఐపీలతో వస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్‌కన్నా… ఐపీఓలపై ఆసక్తి చూపే అవకాశముంది. కాబట్టి మార్కెట్‌ కాస్త డల్‌గా ఉండొచ్చు.

నిఫ్టి 15700 దిగువకు వస్తే కొనుగోలు చేయొద్దు. నిఫ్టి 15,685కి చేరితే నిఫ్టిలో ఒత్తిడి రావొచ్చు.రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,685 స్టాప్‌లాస్‌తో ఎంటర్‌ కావొచ్చు. కాని నిఫ్టి ఈ స్థాయి దిగువకు వస్తే నష్టాలతోనైనా సరే బయటపడండి

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇన్ఫోసిస్‌ 1,471.00 1.67
దివీస్‌ ల్యాబ్‌ 4,372.70 0.88
విప్రో 558.65 0.78
టీసీఎస్‌ 3,294.00 0.62
శ్రీసిమెంట్‌ 28,179.70 0.44

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అదానీ పోర్ట్స్‌ 755.80 -10.00
బజాజ్‌ ఫైనాన్స్‌ 6,028.25 -1.50
ఎన్‌టీపీసీ 117.40 -1.18
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 11,789.80 -0.99
కోల్‌ ఇండియా 161.05 -0.98