For Money

Business News

ట్రూజెట్‌పై దివాలా పిటిషన్‌

అప్పుల్లో కూరుకుపోయిన ట్రూజెట్‌పై (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌లో దివాలా పిటిషన్‌ దాఖలైంది. విమానాలను లీజుకు ఇచ్చిన డే లీజింగ్‌ (ఐర్లాండ్‌) 8 లిమిటెడ్‌ అనే కంపెనీ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. అప్పుల్లో కూరుకుపోవడంతో కొద్ది నెలల కిత్రం ట్రూజెట్‌ సేవలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. లీజు, రెంటల్స్‌ కింద విమాన లీజర్లకు టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ దాదాపు రూ.35 కోట్లు బకాయి పడింది. దీంతో విమానాలను అద్దెకు ఇచ్చిన డే లీజింగ్‌ కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ట్రూజెట్‌లో 79 శాతం వాటాను రూ.200 కోట్లకు సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో విన్‌ఎయిర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ట్రూజెట్‌ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించగలదని గతంలో విన్‌ఎయిర్‌ పేర్కొంది. అయితే ఈ ప్రక్రియ ఒకవైపు సాగుతుండగానే ఎన్‌సీఎల్‌టీ దివాలా పిటీషన్‌ దాఖలైంది.