For Money

Business News

అరబిందో ఫార్మా షేర్‌ ఢమాల్‌

ఇవాళ మార్కెట్‌ బలహీనంగా ఉంది. ఉదయం 18,103 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 158 పాయింట్ల నష్టంతో 17998 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితాలు సరిగా లేని కంపెనీల షేర్లలో భారీ నష్టాలు వస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఫార్మా షేర్లు బలంగా ఉన్నాయి. ఇవాళ కూడా ప్రధాన కంపెనీలు ఒక మోస్తరు నష్టాల్లో ఉన్నాయి. ఫలితాలు సంతృప్తికరంగా లేనందన జైడస్‌ లైఫ్‌ షేర్‌ నాలుగు శాతంపైగా పడింది. అయితే అరబింద్‌ షేర్‌ ఇపుడు ఏడు శాతంపైగా క్షీణించింది. కంపెనీ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డిని ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేయడంతో ఈ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఉదయం రూ. 536 వద్ద ప్రారంభమైన అరబిందో ఫార్మా షేర్‌ ప్రస్తుతం 8శాతం నష్టంతో రరూ. 500.85 వద్ద ట్రేడవుతోంది. ఇది ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. ఈ పతనం ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాలి.