For Money

Business News

అదే స్థాయిలో నిఫ్టి ట్రేడింగ్‌

టెక్నికల్స్‌ ఆధారంగానే ఇవాళ ట్రేడింగ్‌ సాగినట్లు కన్పిస్తోంది. 15,650పై అమ్మకాల ఒత్తిడి రాగా 15520 ప్రాంతంలో మద్దతు అందింది. ఇవాళ ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 15,660ని తాకింది. అదే స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మిడ్‌ సెషన్‌లో నిఫ్టి 15,528ని తాకింది.రోజంతా ఈ మధ్య కదలాడిన నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 8 పాయింట్ల నష్టంతో 15,574 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటి లాగే ఇవాళ కూడా మిడ్‌ క్యాప్‌లో కాస్త ఒత్తిడి అధికంగా ఉంది. ఈ సూచీ 0.6 శాతం నష్టపోయింది. బ్యాంక్‌ నిఫ్టి కూడా అర శాతం క్షీణించింది. ఉదయం లాభాల్లోకి వచ్చిన చాలా బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ వచ్చింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అదానీ పోర్ట్స్‌ 799.00 3.83
ఓఎన్‌జీసీ 117.55 3.43
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,775.00 2.61
ఎస్‌బీఐ 432.55 1.93
హెచ్‌డీఎఫ్‌సీ 2,580.00 1.06

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
JSW స్టీల్‌ 695.00 -2.24
టాటా స్టీల్‌ 1,100.70 -2.22
ఐసీఐసీఐ బ్యాంక్‌ 650.70 -1.82
ఏషియన్‌ పెయింట్స్‌ 2,924.90 -1.77
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,604.90 -1.54