For Money

Business News

మదర్‌ డెయిరీ పాల ధరలు పెంపు

రేపటి నుంచి ఢిల్లీలో పాల ధర పెరగనుంది. లీటర్‌ పాల ధరను రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు మదర్‌ డెయిరీ వెల్లడించింది. సవరించిన ధర మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. ఫుల్‌క్రీమ్‌ మిల్క్‌ లీటర్‌ ధర రూ. 66లకు , టోన్డ్‌ మిల్క్‌ ధరను రూ. 53లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే డబుల్ టోన్డ్‌ మిల్క్‌ ధర కూడా రూ. 45 నుంచి రూ. 47కు పెంచింది. ఈ ఏడాది పాల ధరను మదర్‌ డెయిరీ పెంచడం అయిదోసారి. మార్చి, ఆగస్టు, అక్టోబర్‌, నవంబర్‌ 21వ తేదీన డిసెంబర్‌లో 26న అంటే ఇవాళ ధరలను పెంచింది. ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది.