For Money

Business News

18000పైన ముగిసిన నిఫ్టి

ఉదయం అనలిస్టులు ఇచ్చిన వ్యూహం ఇవాళ పక్కాగా అమలు కావడం విశేషం. అనుకున్నట్లే ఓపెనింగ్‌లో వచ్చిన లాభాలు కొన్ని క్షణాల్లో కరిగిపోయాయి. అక్కడి నుంచి దిగువ స్థాయిలో కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. ఎక్కడా స్థాయి ఇవ్వలేదు. తొలి గంటలో నిఫ్టి పడితే కొనమని సలహా ఇచ్చారు. అంతే. నిఫ్టి ఓపెనింగ్‌లో 17774ని తాకిన నిఫ్టి ఏకంగా 300 పాయింట్లు కోలుకుని 18084 స్థాయిని తాకింది. స్వల్పంగా తగ్గి 18014 వద్ద ముగిసింది. క్రితం ముగింపుత పోలిస్తే నిఫ్టి 208 పాయింట్లు లాభపడింది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో భారీ లాభాలు వచ్చాయి. దాదాపు అన్ని ప్రధాన సూచీలు ఇవాళ రెండు శాతంపైగా లాభపడ్డాయి. నిఫ్టిలో ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నాలుగు శాతం లాభపడగా… హిందాల్కో మూడు శాతం లాభపడింది. గత కొన్ని రోజులుగా పెరిగిన ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభంలో లాభాల్లో ఉన్న దివీస్‌ ల్యాబ్‌ రెండు శాతం నష్టపోగా, సిప్లా కూడా ఇదే స్థాయి నష్టాలతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఏకంగా 9 శాతంపైగా లాభపడగా, జొమాటో 8.5 శాతం లాభపడింది. సంవర్ధన్‌ మదర్సన్‌ ఏడు శాతం, పేటీఎం 6.5 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5 శాతంపైగా లాభపడ్డాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా ఇదే స్థాయిలో లబ్ది పొందాయి. అయితే మిడ్‌ క్యాప్‌ పీఎస్‌యూ బ్యాంకుల ఇవాళ సూపర్‌గా రాణించాయి. పీఎన్‌బీ ఏకంగా 8 శాతంపైగా లాభపడింది. ఫెడరల్ బ్యాంక్‌ ఏడు శాతం పెరగడం విశేషం.