మళ్ళీ నిరాశ పర్చిన టాటా మోటార్స్
టాటా మోటార్స్‌కు నష్టాల బెడద ఇప్పట్లో పోయేలా లేదు. ప్రతి త్రైమాసికంలో ఏదో కారణంగా భారీ నష్టాలను ప్రకటింస్తోంది కంపెనీ. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 63, 349 కోట్ల టర్నోవర్‌పై రూ. 1,891 కోట్ల నికర నష్టం ప్రకటిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 66,406.05 కోట్ల అమ్మకాలపై రూ. 4,450.12 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాన్ని ప్రకటించింది. సెమి కండక్టర్ల కొరత కారణంగా కంపెనీ పనితీరు బాగా దెబ్బతింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను కంపెనీ సరఫరా చేయలేకపోయింది. ముఖ్యంగా జాగ్వర్ ల్యాండ్ రోవర్ విభాగం బాగా దెబ్బతీసింది. గత ఏడాది నష్టాలతో పోలిస్తే సగం తగ్గినా… మారిన పరిస్థితుల్లో మార్కెట్ అనలిస్టుల అంచనాలను అందుకోవడంలో కంపెనీ విఫలమైంది.
