టాటా మోటార్స్ ఎస్‌యూవీ పంచ్
సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘పంచ్’ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ నెల 20న పంచ్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. డీలర్ల ద్వారా లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.21,000 చెల్లించి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. కంపెనీ కార్లలో నెక్సాన్ తర్వాతి స్థానంలో పంచ్ నిలవనుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల్లో లభిస్తుంది. టాల్ సీటింగ్, హై గ్రౌండ్ క్లియరెన్స్, 370ఎంఎం వాటార్ వేడింగ్ సామర్థ్యం, ట్రాక్షన్, 366 లీటర్ల బూట్ స్పేస్, హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారులు చిన్న ఎస్‌యూవీ, సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీల కోసం చూస్తున్నారని, అటువంటి వారికి పంచ్ మోడల్ నచ్చుతుందని టాటా మోటార్స్ అంటోంది. మార్కెట్‌లో గిరాకీని బట్టి.. విద్యుత్ వెర్షన్‌ను కూడా తీసుకు రానున్నట్లు కంపెనీ పేర్కొంది.
