For Money

Business News

ఒక్క షేరు మినహా…

మార్కెట్‌ ఇవాళ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. షాట్‌ కొట్టినవారు పండుగ చేసుకోగా, లాంగ్‌ పొజిషన్స్‌ ఉన్నవారు, ఇన్వెస్టర్లు మాత్రం నిండా మునిగిపోయారు. ఈ వారంలో వచ్చిన లాభాలు పోగా… కొత్త లాభాలు మూట గట్టుకున్నారు. దీర్ఘకాలిక, స్వల్ప ఇన్వెస్టర్ల పోర్టు ఫోలియోలు కరిగిపోతున్నాయి. మెజారిటీ మిడ్‌క్లాస్‌ అకౌంట్లలో షేర్ల విలువ సగానికి పడిపోయింది. గల్ఫ్‌ యుద్ధం గురించి మన దేశం పెద్దగా పట్టించుకోక పోవడం, పెద్దగా మనకు ఇబ్బంది లేదని చెబుతూ వచ్చిన మాటలు విని చాలా మంది నష్టపోయారు. అనేక మంది ఈ యుద్ధం వల్ల గ్యాస్‌, పెట్రోల్‌ కష్టాలు మాత్రమే ఉంటాయని అనుకున్నారు. దాదాపు అన్ని పరిశ్రమలు ఈ యుద్ధం వల్ల దెబ్బతిన్నాయి. యుద్ధం ఆగినా కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ఒక మోస్తరు నష్టాలు వచ్చిన ఇన్వెస్టర్లు కూడా అమ్ముకుని బయట పడుతున్నారు. ఏ ఛానల్‌ చూసినా… నష్టాలు చాలు.. యావరేజ్‌ చేయకండి సలహాలు ఇస్తుండటంతో… కొత్తగా బయ్యర్లు లేరు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ డల్‌గా మారడంతో …. కొత్త పెట్టుబడులకు దారులు మూసుకుపోతున్నాయి. నిఫ్టి ఇవాళ 775 పాయింట్లు నష్టపోయినా… మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు బాగా పడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ ఇవాళ లక్ష కోట్లు పోయినట్లుంది. మొత్తం ఫైనాన్షియల్‌ రంగం కుప్పకూలింది. రూ. 1100 నుంచి రూ. 820కి వచ్చినా బజాజ్‌ ఫైనాన్స్‌కు కొనుగోలుదారులు లేరు. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఇవాళ టాప్‌ నిఫ్టి లూజర్. ఒక్క ఓఎన్‌జీసీ మినహా నిఫ్టి షేర్లన్నీ నష్టాలతో ముగిశాయి. మిడి సెషన్‌ తరవాత అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కావడంతో నిఫ్టి 23 వేల స్థాయి దిగువకు వచ్చేసింది. చివరికి 23002 వద్ద ముగిసింది. దాదాపు ప్రధాన సూచీలన్నీ మూడు శాతం నష్టపోవడం చాలా అరుదు. ఇరాన్‌కు జరుగుతున్న నష్టం కన్నా… ఇతర దేశాలకు జరుగుతున్న నష్టం అత్యంత తీవ్రంగా ఉంది.