For Money

Business News

డెలివరీ బాయ్‌గా జొమాటో యజమాని

కంపెనీ రోజువారీ వ్యవహారాలు చూసే సీఈఓలు క్షేత్రస్థాయిలో తమ కంపెనీ పట్ల ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకోవడం కోసం మారు వేషాల్లో కస్టమర్ల మధ్య తిరుగుతుంటారు. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు ఇలా చేస్తుంటారు. జొమాటొ కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ కూడా ఓ ఉద్యోగిలా ఫుడ్‌ డెలివరీ బాయ్‌లా పనిచేస్తున్నరట. నౌకరీ డాట్‌ కామ్‌ యజమాని, వైస్‌ చైర్మన్‌ సంజీవ్‌ బిక్‌చందానీ ఈ విషయాన్ని వెల్లడించారు. జొమాటొ సీఈఓ సాధారణ డెలివరీ బాయ్‌లా రెడ్‌ టీ షర్ట్‌ ధరించి.. బైక్‌ మీద ఫుడ్‌ డెలివరీలు చేస్తున్నారని తెలిసి తాను ఆశ్యర్యపోయానని బిక్‌ చందానీ అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి.. గడిచిన మూడేళ్లుగా దీపిందర్‌ గోయల్‌ ఇలా చేస్తున్నారని ఆయన ట్వీట్‌ చేశారు. జొమాటోలో పనిచేసే సీనియర్‌ మేనేజర్లందరూ ఇదే తరహాలో ప్రతి మూడు నెలలకోసారి డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తుతుంటారని బిక్‌చందాని తెలిపారు. ఇప్పటి వరకు తనను ఎవరూ గుర్తు పట్టలేదని దీపిందర్‌ తనతో చెప్పినట్లు బిక్‌చందానీ ట్వీట్‌ చేశారు.