For Money

Business News

WPI: ఆగస్టులో 11.39 శాతానికి

టోకు ధరల సూచీ (WPI) ఈ ఏడాది ఆగస్టు నెలలో 11.39 శాతానికి చేరిందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో ఈ సూచీ 0.41 శాతం పెరిగింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో WPI 12.07 శాతం ఉండగా, జులైలో 11.16కి తగ్గింది. కాని ఆగస్టులో మళ్ళీ పెరిగి 11.9 శాతానికి చేరింది. ఆహారేతర వస్తువులు, మినరల్‌ ఆయిల్స్‌, క్రూడ్‌ పెట్రోలియం, న్యాచురల్‌ గ్యాస్‌, మ్యాన్యూఫ్యాక్చర్డ్‌ ప్రొడక్ట్స్‌ ధరలు పెరిగినందున టోకు ధరల సూచీ పెరిగిందని వాణిజ్య శాఖ పేర్కొంది.