For Money

Business News

వడ్డీ రేట్లు పెంచడం ఖాయం

జూన్‌ నెలలో సమావేశమయ్యా పరపతి కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ…ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని స్టాక్‌ మార్కెట్‌ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. జూన్‌లో వడ్డీ రేట్లను పెంచుతామని, అయితే ఎంత అని మాత్రం చెప్పలేనని ఆయన అన్నారు. రెపో రేటు 5.15 శాతం దాకా పెంచే అవకాశముందని అన్నారు. మార్కెట్‌లో అధికంగా ఉన్న లిక్విడిటీని తొలగించడానికి ఆర్బీఐ రెడీ ఉందని అన్నారు. అయితే దశలవారీగా దీన్ని తగ్గిస్తామన్నారు. రెండు, మూడేళ్ళలో లిక్విడిటీ సాధారణ స్థాయికి వస్తుందన్నారు. అలాగే రూపాయి వరుసగా బలహీనపడటాన్ని ఆర్బీఐ అనుమతించదని అన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ 110 డాలర్ల వద్ద ఉండటం, ద్రవ్యోల్బణం కంటే అధిక ఆందోళన కల్గించే అంశమని శక్తికాంత దాస అన్నారు.