మరో సపోర్ట్ గోవిందా?
నిఫ్టి ఇవాళ మరో సపోర్ట్‌ను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఎక్కడా ఎలాంటి పాజిటివ్ సంకేతాలు లేకపోవడం, మన దేశ క్రూడ్ బాస్కెట్ ధర 100 డాలర్లను దాటడతో సెంటిమెంట్ మరింత దెబ్బతింది. ఇవాళ డిఫెన్స్‌తో పాటు ఏఐ షేర్లు రాణిస్తే నిఫ్టి ఏమైనా కోలుకుంటుందేమో గాని… లేకుండా భారీ పతనానికి శ్రీకారం చుట్టినట్లే. గడచిన 30 రోజుల్లో నిఫ్టి 1000 పాయింట్లు క్షీణించింది. కాని ఎలాంటి సపోర్ట్ కన్పించడం లేదు. గిఫ్ట్‌నిఫ్టి 80 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. అయితే ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టికి దిగువస్థాయిలో మద్దతు వస్తుందేమో చూడాలి. 10.30లోగా ఈ మద్దతు అందితే… నిఫ్టి కనీసం నష్టాలు తగ్గుతాయి. స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తూ లక్ష కోట్ల డిఫెన్స్ పరికరాల కొనుగోలు కేంద్రం ఓకే చెప్పింది. అయితే ఇది కార్యరూపం దాల్చడానికి టైమ్ పట్టొచ్చు. కాబట్టి ఇవాళ డిఫెన్స్ షేర్లు పెరిగినా… వెంటనే లాభాలు బుక్ చేసుకోవడం బెటర్. ట్రెండ్ బలపడే వరకు డైలీ ప్రాఫిట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం బెటర్. లేదా దీర్ఘ కాలిక పెట్టుబడికి మల్టి బ్లాగర్స్‌ను వెతుక్కోవడం మంచిది. ఇవాళైతే మార్కెట్‌ను ప్రభావిం చేసే అంశాలు ఏవీ లేవు. టెక్నికల్‌గా కోలుకోవడమే. సో… నిఫ్టి కన్నా… ఎంపిక చేసిన షేర్లలో ట్రేడింగ్ లాభదాయకం.
