సాజిలిటీ టార్గెట్ పెంచిన జెఫరీస్
సాజిలిటీ కంపెనీ నిన్న సాయంత్రం ఫలితాలను ప్రకటించింది. ఫలితాలను మదింపు వేసిన తరవాత ఈ కంపెనీ షేర్ రెకమెండ్ టార్గెట్ ధరను రూ. 54 నుంచి రూ. 59కు పెంచింది జెఫరీస్. ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా పెరిగినా… నికర లాభం భారీగా పెరిగింది. Q2లో ఈ కంపెనీ రూ. 2,032 కోట్ల ఆదాయంపై రూ. 284 కోట్ల నికర లాభం ప్రకటించింది. నికర లాభం ఏకంగా 31 శాతం పెరగ్గా, ఎబిటా మార్జిన్ 18.7 శాతానికి చేరింది. గతంలో పలు బ్రోకింగ్ రీసెర్చి సంస్థలు ఈ షేర్ టార్గెట్‌ను రూ. 60గా కూడా ప్రకటించాయి.
