చిన్న ఇన్వెస్టర్ల కడుపు కొట్టారు
చిన్న ఇన్వెస్టర్ల కడుపు కొట్టారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై భారీగా STT ఇతర చార్జీలు పెంచారు. దీంతో చాలా మంది చిన్న, మధ్య తరగతి ఇన్వెస్టర్లు ఆప్షన్స్ బదులు ఎంటీఎఫ్ (Margin Trading Fund) చేస్తున్నారు. అంటే వంద రూపాయలు మనం పెడితే… బ్రోకర్లు/బ్యాంకులు షేర్‌ను బట్టి మూడు నుంచి నాలుగు వందల మార్జిన్ ఇస్తారు. అంటే వంద రూపాయలతో రూ. 400 వరకు విలువైన షేర్లను కొనొచ్చన్నమాట. అలా కొన్న షేర్ల విలువ గత బుధవారం నాటికి రూ. 1.47 లక్షల కోట్లు. చాలా రోజులు నిఫ్టి షేర్లు మాత్రమే పడేవి. దీంతో ఈ షేర్ల వల్ల పెద్ద లాభాలు రాకపోయినా… నష్టాలు వచ్చేవి కావు. కాని గత వారం నుంచి ఈ షేర్లు భారీగా పడ్డాయి. దీంతో మార్జిన్‌ను దాటాయి. వెంటనే డబ్బు సర్దలేనివారి షేర్లు ఆటోమేటిగ్గా సేల్ అయిపోయింది. దీంతో చాలా మంది చిన్న, మధ్య తరగతి ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. రిలయన్స్ జియోలో పెట్టుబడికి తమ ఎంటీఎఫ్ షేర్లు అమ్మారని కొందరు అంటున్నారు. ఒకేసారి ఈ స్థాయిలో ఒత్తిడి రావడం… నిఫ్టి టెక్నికల్ స్థాయిలకు దిగువకు రావడమేనని అనలిస్టులు అంటున్నారు. 22,750 స్థాయి మార్కెట్ గట్టి సపోర్ట్‌గా ఉండేది. అది బ్రేక్ అవగానే పెద్ద ఇన్వెస్టర్లు అమ్మడం మొదలు పెట్టారు. వెంటనే నిఫ్టి 52 వారాల కనిష్ఠ స్థాయి 22150కి చేరుతుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో అమ్మకాలు పెరిగాయి. క్రూడ్ ధరలు ఇప్పట్లో తగ్గవని వార్తలు వస్తుండటంతో, బంగారం రుణం తీసుకున్నవారు బ్యాంకుల నుంచి ఒత్తిడి రావడంతో తమ వద్ద షేర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బంగారం ధర భారీగా పెరగడంతో బంగారం తాకట్టు పెట్టి షేర్లు కొన్నవారికి డబుల్ షాక్ తగ్గింది. అయితే ఎంటీఎఫ్ వల్ల ఇన్వెస్టర్లు నష్టపోయినా… మార్జిన్ పోగా మిగిలిన మొత్తాన్ని మళ్ళీ ఎంఎఫ్టీలోనే షేర్లు కొన్నారని… దీంతో ఎంటీఎఫ్ మొత్తంలో పెద్ద మార్పు లేకున్నా… షేర్ల నష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి.
