For Money

Business News

NIFTY TODAY : దిగువ కొనొచ్చా?

మార్కెట్‌ వంద పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు డల్‌గా ఉండటం ఒక కారణం కాగా, ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులే ఉంటుంది. హోలి కారణంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు. కాబట్టి ఎఫ్‌ అండ్‌ ఓలో ట్రేడ్‌ చేసే వారు ఈ విషయం గమనించాలి. ఇక డే ట్రేడింగ్‌ విషయానికొస్తే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే మద్దతు స్థాయి వద్ద ప్రారంభం కానుంది. ఇవాళ్టి
ట్రేడింగ్‌కు నిఫ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ 16771
రెండో ప్రతిఘటన 16733
తొలి ప్రతిఘటన 16709
నిఫ్టి కీలక స్థాయి 16599
తొలి మద్దతు 16552
రెండో మద్దతు స్థాయి16528
డౌన్‌ బ్రేకౌట్‌ 16491

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఎఫ్‌ అండ్‌ఓలో గతవారం 6000 షార్ట్స్‌ను వీరు కవర్‌ చేసుకున్నారు. లాంగ్, షార్ట్‌ నిష్పత్తి 43%:57%గా ఉంది. దాదాపు 30,000 కాల్స్‌, పుట్స్‌ను కొనుగోలు చేశారు. ప్రతి రెండు కాల్స్‌కు మూడు పుట్స్‌ రాస్తున్నారు. అంటే మార్కెట్‌ ఎక్కడి దాకా పడుతుందో మార్కెట్‌కు ఓ క్లారిటీ వస్తోంది. అలాగే 16300తో పాటు 16500 వద్ద పుట్‌ రైటింగ్‌ జరుగుతోంది. ఇక నిఫ్టి కీలక స్థాయిలు చూస్తే… 20 DMA 16767 వద్ద, 200 DMA 16967 వద్ద ఉంది.