For Money

Business News

రిస్క్‌ను బట్టి ఈ మూడు షేర్లూ కొనొచ్చు

తమ రిస్క్‌ను బట్టి షేర్లలో ట్రేడ్‌ చేసేవారికి ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని మూడు షేర్లను రెకమెండ్‌ చేస్తున్నారు. చాలా తక్కువ రిస్క్‌ కోరుకునే వారికి ఆయన ఐటీసీ షేర్‌ను రెమెండ్‌ చేస్తున్నారు. రూ.228 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని… టార్గెట్‌ రూ. 265గా పేర్కొన్నారు. ఇక ఒక మోస్తరు రిస్క్‌ను భరించే వారు సన్‌ ఫార్మా షేర్లను కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. రూ. 875 స్టాప్‌లాస్‌తో రూ. 1050 టార్గెట్‌ కోసం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక అధిక రిస్క్‌తో భరించే ఇన్వెస్టర్లకు జీఎస్‌ఎఫ్‌సీ షేర్‌ను రెకమెండ్‌ చేస్తున్నారు. రూ. 165 టార్గెట్‌తో రూ. 130 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.