For Money

Business News

టీటీడీ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ వివరణ

హైదరాబాద్‌ శివారులోని అమీన్‌పూర్‌లో ఫ్లాట్ల పేరుతో మాయమాటలు చెప్పి రూ. 1,500 కోట్లు కొల్లగొట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా అధినేత బూదాటి లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ కంపెనీ సాహితీ శ్రావణి ఎలైట్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫ్లాట్ల యజమానులు నిన్న ఆందోళన చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తలకు లక్ష్మీ నారాయణ స్పందిస్తూ… కొన్ని సోషల్ మీడియా సంస్థల్లో తాను రూ.1500 కోట్లు వసూలు చేశానని, ఐపీ పెట్టబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఫ్లాట్ల యజమానులతో మాట్లాడేందుకు ఆదివారం మీటింగ్‌ షెడ్యూల్‌ చేసినా.. వారు శనివారం ఆందోళన జరిపి… అసభ్య పదజాలం ఉపయోగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి భావోద్వేగాన్ని తాము అర్థం చేసుకున్నామని… పూర్తి వివరాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తామని ఆయన చెప్పారు. తమపై తప్పుడు సమాచారం ప్రచారం చేసి సోషల్‌ మీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.