For Money

Business News

వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

హౌసింగ్‌ రుణాల మార్కెట్‌లో రారాజు అయిన హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లను పెంచింది. తమ రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. దీంతో గృహ రుణాలపై వడ్డీరేటు 7.80 శాతం నుంచి 8.30 శాతానికి చేరాయి.కొత్త రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. కొత్తగా తీసుకునే రుణాలతోపాటు పాత ఖాతాదారులకు కూడా ఈ వడ్డీరేటు వర్తించనున్నది. వచ్చేవారం ఆర్బీఐ సమీక్ష కంటే ముందే హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లను పెంచడం విశేషం. అలాగే గృహ రుణాలపై రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు(ఆర్‌పీఎల్‌ఆర్‌)ని కూడా పావు శాతం సవరించింది. గడిచిన రెండు నెలల్లో వడ్డీరేట్లను పెంచడం ఇది ఐదోసారి కావడం విశేషం. మే నెల నుంచి ఇప్పటి వరకు వడ్డీరేట్లు 1.15 శాతం పెంచింది.