For Money

Business News

ఎన్డీటీవీ ఓపెన్‌ ఆఫర్‌కు కట్టుబడి ఉన్నాం..

ఎన్డీటీవీలో అదనపు 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌కు కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఓపెన్‌కు ఆఫర్‌కు సంబంధించి తాము దాఖలు చేసిన డ్రాఫ్ట్‌ ఓపెన్‌ ఆఫర్‌ లెటర్‌పై సెబీ నుంచి స్పందనలేదు. దీంతో అదానీ గ్రూప్‌ సెబీకి లేఖ రాసింది. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ఎన్డీటీవీ ఓపెన్‌ ఆఫర్‌ అమలు కావాల్సింది. సెబీ నుంచి అనుమతి రాకపోవడంతో ఓపెన్ ఆఫర్‌ ఇంకా ప్రారంభం కాలేదు. విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వీసీపీఎల్‌) వద్ద తీసుకున్న రూ.400 కోట్ల రుణానికి ఎన్డీటీవీ 29.18 శాతం వారంట్లు జారీ చేసింది. ఏ సమయంలోనైనా ఈ వారంట్లను వాటాలుగా మార్చుకునేందుకు వీసీపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది ఎన్డీటీవీ. వీసీపీఎల్‌ను అదానీ టేకోవర్‌ చేయడంతో ఆ గ్రూప్‌కు ఎన్డీటీవీ దాదాపు 30 శాతం వాటా దక్కింది. నిబంధనల ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉన్నందున 26శాతం అదనపు వాటా కొనుగోలు చేయడానికి ఈ నెల 17నుంచి మైనారిటీ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రతిపాదించింది. రూ.294లకు 26శాతం లేదా 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌తో కలిసి వీసీపీఎల్‌ క్లయిమ్‌ చేసింది. కాని సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో… ఓపెన్‌ ఆఫర్ ఫ్రారంభం కాలేదు.