For Money

Business News

మిశ్రమంగా వాల్‌స్ట్రీట్‌

యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసినా..అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. నాస్‌డాక్‌ గ్రీన్‌లో ఉండగా, ఎస్‌ అండ్ పీ 500, డౌజోన్స్‌ సూచీలు రెడ్‌లో ఉన్నాయి. క్రూడ్‌ ధరలు తగ్గడంతో ఎనర్జీ షేర్లు భారీగా తగ్గాయి. డౌజోన్స్‌ 0.47 శాతం నష్టంతో, నాస్‌ డాక్‌ 0.56 శాతం లాభంతో ఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500లో పెద్ద మార్పు లేదు. డాలర్‌ ఇవాళ స్వల్పంగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 104ని దాటింది. అయితే బాండ్‌ ఈల్డ్స్‌ గణనీయంగా తగ్గడం విశేషం. 3.33 శాతం ఉన్న పదేళ్ళ బాండ్ ఈల్డ్స్‌ ఇపుడు మూడు శాతం దగ్గరకు వస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్ ఇవాళ కూడా రెండు శాతం తగ్గింది. బ్రెంట్ క్రూడ్‌ 110 డాలర్ల దిగువకు వచ్చింది. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి. బంగారంలో పెద్ద మార్పు లేకున్నా వెండి మాత్రం ఒక శాతంపైగా నష్టపోయింది.