For Money

Business News

డిష్‌ టీవీ ప్రమోటర్లకు చుక్కెదురు

డిష్‌ టీవీ ఇండియా ప్రమోటర్‌ సంస్థ అయిన వరల్డ్‌ క్రెస్ట్‌ అడ్వియజర్స్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఎస్‌బ్యాంక్‌కు అనుకూలంగా వచ్చిన సింగిల్‌ జడ్జి తీర్పును వరల్డ్‌ క్రెస్ట్‌ అడ్వయిజర్స్‌ సవాలు చేసింది. డిష్‌ టీవీ షేర్లను క్యాటలిస్ట్‌ ట్రస్టీ ద్వారా తాకట్టు పెట్టి ఎస్‌ బ్యాంక్ నుంచి జీటీవీ ప్రమోటర్లు రుణం తీసుకున్నారు. అలాగే ఈ షేర్లను తాకట్టు పెట్టి సుభాష్‌ చంద్రకు చెందిన కొన్ని కంపెనీలు రుణాలు తీసుకున్నాయి. ఎస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణాలతో తమకు సంబంధం లేదని డిష్‌ టీవీ ప్రమోటర్లు అంటున్నారు. అయితే వారి వాదనను కోర్టు కొట్టేసింది. తాకట్టు పెట్టిన షేర్లను ఈక్విటీగా మార్చుకోవడంతో డిష్‌ టీవీలో ఎస్‌ బ్యాంక్‌కు 24.19 శాతం వాటా లభించింది. ఈనెల 24న జరిగే అసాధారణ సమావేశానికి ఎస్‌ బ్యాంక్‌ హాజరు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డిష్‌ ప్రమోటర్లు కోరర్టును ఆశ్రయించారు. అయితే వారి వాదనను తిరస్కరిస్తూ డివిజన్‌ బెంచ్‌ ఇవాళ తీర్పు ఇచ్చింది.