లాభాల్లో వాల్‌స్ట్రీట్
నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్ కొద్ది సేపటికే గ్రీన్‌లోకి వచ్చింది. ఇటీవలి కాలంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన నాస్డాక్ ఇవాళ 1.28 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.42 శాతం లాభంతో ఉంది. అయితే డౌజోన్స్ మాత్రం క్రితం ముగింపు వద్ద ట్రేడవుతోంది. ఎలాంటి లాభాలు లేవన్నమాట. కరెన్సీ మార్కెట్లో డాలర్ దూకుడు చూస్తుంటే వాల్‌స్ట్రీట్ క్లోజింగ్ వరకు లాభాల్లో ఉంటుందా అన్న అనుమానం కల్గుతోంది. ముఖ్యంగా గ్రోత్ స్టాక్స్ వస్తున్న అమ్మకాల ఒత్తిడి డౌజోన్స్ను బలహీనపరుస్తోంది. మరోవైపు అమెరికా పదేళ్ళ ట్రెజరీ ఈల్డ్స్ కూడా 3.769కి చేరింది. క్రూడ్ ఆయిల్ ఇవాళ స్వల్పంగా కోలుకుంది. బ్రెంట్ క్రూడ్ 86 డాలర్లపైన ట్రేడవుతోంది. ఇక బులియన్ మార్కెట్లో బంగారం స్థిరంగా ఉండగా… ఇటీవల బాగా క్షీణించిన వెండి ఒక శాతంపైగా లాభంతో ఉంది.