For Money

Business News

లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌ ఇపుడు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతోంది. డాలర్‌ కూడా దాదాపు పావు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చాలా వరకు లాభాలు తగ్గాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ కేవలం 0.15 శాతం లాభంతో ఉంది. మరికొద్ది సేపట్లో యూరో మార్కెట్లు ముగుస్తున్నాయి. తరవాత వాల్‌స్ట్రీట్‌ ఎలా ఉంటుందో చూడాలి. ప్రన్తుతం నాస్‌డాక్‌ 0.68 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.38 శాతం, డౌజోన్స్‌ 0.6 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 0.25 శాతం లాభంతో ఉన్నా.. బులియన్‌ గ్రీన్‌లో ఉండటం విశేషం. ఔన్స్‌ బంగారం ఇపుడు 1827 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా స్వల్పంగా పెరిగి 23.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.