For Money

Business News

యాపిల్‌ ఫోన్లలో ఇక ‘ట్యాప్‌ టు పే’

చెల్లింపుల కోసం ఒక ప్రత్యేక హార్డ్‌వేర్‌, పేమెంట్‌ టర్మినల్‌ అక్కర్లేదు. కేవలం ఐ ఫోన్‌పై మీరు ట్యాప్‌ చేస్తే చాలు పేమెంట్‌ జరిగిపోతుంది.యాపిల్‌ పే, కాంటాక్ట్‌ లెస్‌ క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, ఇతర డిజిటల్‌ వాలెట్స్‌ నుంచి కేవలం ఐ ఫోన్‌పై ట్యాప్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చని యాపిల్‌ ఇవాళ ప్రకటించింది. ఇప్పటి వరకు ఇలాంటి చెల్లింపుల కోసం ఫోన్‌లో బ్లాక్‌ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన స్క్వేర్‌ టెర్మినల్‌ ఉండాల్సిందే. కాని ఇపుడు ఎలాంటి అదనపు టర్మినల్స్‌, హార్డ్‌వేర్‌ అక్కర్లేదు. స్ట్రైప్‌ సంస్థ తొలిసారి ఈ సర్వీస్‌ను అందించనుంది. తరవాత షాపిఫై పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యాప్‌ ట్యాప్‌ టు పేను ఉపయోగిస్తున్నట్లు యాపిల్‌ చెప్పింది. తరవాత ఇతర అదనపు పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లకు, యాప్స్‌కు అనుమతిస్తామని యాపిల్‌ పేర్కొంది.