For Money

Business News

సువేన్ ఫార్మా చేతికి కాస్పర్‌ ఫార్మా?

హైదరాబాద్‌లోని కాస్పర్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను టేకోవర్ చేసేందుకు సువేన్‌ ఫార్మా రెడీ అవుతోంది. టేకోవర్‌ కోసం కాస్పర్‌ మదింపు ప్రక్రియ మొదలు పెట్టేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లో కాస్పర్‌కు అడ్వాన్స్‌డ్‌ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్‌ యూనిట్‌ ఉంది. త్వరలోనే ఈ ప్లాంట్‌ను అమెరికా ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినేష్ట్రన్‌ (FDA)అధికారులు పరిశీలించనున్నారు. ఎఫ్‌డీఐ ఆమోదం లభిస్తే.. ఇక్కడి ఉత్పత్తులను అమెరికాలో మార్కెట్‌ చేసే అవకాశం లభిస్తుంది. కాస్పర్‌ టేకోవర్‌కు సంబంధించి లీగల్‌, ఫైనాన్షియల్‌తోపాటు ట్యాక్స్‌లకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు వివిధ సంస్థలను నియమించినట్లు సువేన్‌ ఫార్మా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాస్తి వెంకటేశ్వర్లు మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌కు తెలిపారు. రెడీగా ఉన్న ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం వల్ల మూడు,నాలుగేళ్ళ శ్రమ తగ్గుతుందని ఆయన అన్నారు.