For Money

Business News

సూచీలు గ్రీన్‌లోనే…

వాల్‌స్ట్రీట్‌ లాభాల్లో ఉంది. ఒకదశలో నాస్‌డాక్‌ ఒక శాతానికి పెరిగినా.. ఇపుడు అరశాతం లాభానికి పరిమితమైంది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా. నామమాత్రపు లాభాల్లో డౌజోన్స్ ఉంది. ఓపెనింగ్‌లో స్థిరంగా ఉన్న డాలర్‌ క్రమంగా బలపడింది. 108.70 వద్ద డాలర్‌ ఇండెక్స్‌ ట్రేడవుతోంది. అంతకుముందు యూరో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో నష్టాల్లో ఉన్నా… క్రమంగా కోలుకున్నాయి. చాలా సూచీల లాభాలు అర శాతంలోపే ఉన్నాయి. ఇక క్రూడ్‌ విషయానికొస్తే బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 100 డాలర్లను దాటింది. ఇక బులియన్‌ స్థిరంగా ఉంది.