For Money

Business News

విద్యార్థులకు విద్యా రుణ మాఫీ

ఒక్కో విద్యార్థికి పది వేల డాలర్లు అంటే రూ. 8,00,000 వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జొ బైడన్‌ ప్రకటించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇచ్చ పెల్‌ గ్రాంట్‌ తీసుకునే విద్యార్థులకు ఏకంగా 20,000 డాలర్లు అంటే రూ. 16,00,000 వరకు విద్యా రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రుణ మాఫీ కేవలం ఏడాదికి 1,25,000 డాలర్ల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకే వర్తిస్తుంది. ఇంటి పెద్దలు ఇద్దరూ పనిచేస్తుంటే లేదా పెళ్ళినవారి కుటుంబానికైతే 2,50,000 డాలర్ల లోపు ఆదాయం ఉండాలి. ఇంతకు మించి వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ రుణ మాఫీ వర్తించదు. మరోవైపు డిసెంబర్‌ 31వ తేదీ వరకు విద్యా రుణాలు చెల్లించకుండా మారిటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది చివరి అవకాశమని పేర్కొన్నారు. అంటే డిసెంబర్‌ 31వ తేదీ వరకు విద్యా రుణాలకు సంబంధించిన చెల్లింపులు ఏవీ విద్యార్థులు కట్టాల్సిన పనిలేదు. ఇవన్నీ బైడెన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు.