For Money

Business News

యుద్ధ మేఘాలు: వాల్‌స్ట్రీట్‌ ఢమాల్‌

ఇప్పటికే మార్చి నెలలో వడ్డీ రేట్లను ఫెడ్‌ పెంచుతుందని ఆందోళన చెందుతున్న ఈక్విటీ మార్కెట్లలో ఇపుడు యుద్ధ భయాలు మొదలయ్యాయి. రానున్న 48 గంటల్లో రష్యా ఏక్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేయొచ్చని వార్తలు రావడంతో… షేర్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం నుంచి ఒక మోస్తరు లాభాల్లో ఉన్న ఈక్విటీ మార్కెట్ల చివర్లో భారీగా పతనమయ్యాయి. చివర్లో షార్ట్‌ కవరింగ్‌తో స్వల్పంగా పెరిగినా.. నాస్‌ డాక్‌ ఏకంగా 2.78 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.9 శాతం నష్టపోవడం విశేషం. ఇక డౌజోన్స్‌ కూడా భారీ నష్టాలు తప్పలేదు. ఈ షేర్‌ 1.43 శాతం క్షీణించింది. మార్కెట్‌ ముగిసిన తరవాత కూడా ఫ్యూచర్స్‌ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఫ్యూచర్స్‌1.75 శాతం నష్టంతో ఉంది. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో వస్తున్న వార్తలను రష్యా ఖండిస్తున్నా… అమెరికా ఉన్నతాధికారులు మాత్రం దాడి జరగడం ఖాయమని నమ్ముతున్నారు.