For Money

Business News

వొడాఫోన్‌ సీఈఓ రాజీనామా

కంపెనీ పనితీరు నానాటికి తీసికట్టుగా మారడంతో షెడ్యూల్‌ కంటే ముందే వోడాఫోన్‌ సీఈఓ నిక్‌ రీడ్‌ రాజీనామా చేశారు. బ్రిటన్‌కు చెందిన ఈ టెలికామ్‌ కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రీడ్‌ ఈ నెలాఖరులో వైదొలగుతుండగా.. ఆయన స్థానంలో ప్రస్తుత చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మార్గెరిటా డెల్లా తాత్కాలికంగా సీఈఓ బాధ్యతలు చేపడుతారు. వోడాఫోన్‌ షేర్‌ ప్రస్తుతం 20 ఏళ్ళ గరిష్ఠ స్థాయిని తాకింది. రీడ్‌ బాధ్యతలు స్వీకరించిన షేర్‌ ధర సగానికి తీగ్గింది.