For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

గుజరాత్‌ ఎగ్జిట్‌ పోల్‌ నేపథ్యంలో మార్కెట్‌ ఇవాళ తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు ఊహించినట్లు మార్కెట్‌కు దిగువ స్థాయిలో మద్దతు లభించింది. పది గంటల ప్రాంతంలో 18591 పాయింట్లను తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌లో ఏకంగా 18728 పాయింట్లను తాకింది.మళ్ళీ నష్టాల్లోకి జారకున్నా.. చివర్లో కోలుకుని 18701 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే చివర్లో భారీ లాభాల్లో ముగుస్తుందని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 5 పాయింట్ల లాభంతో ముగిసింది. అయితే నిఫ్టి బ్యాంక్‌ అర శాతంపైగా లాభపడటం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. చైనలో కోవిడ్‌ కేసులు భారీగా తగ్గాయన్న వార్తలతో మెటల్‌ కంపెనీలు బాగా పెరిగాయి. అలాగే బంగారం ధరలు కూడా బాగా పెరడంతో… బంగారం తాకట్టు బిజినెస్‌లో ఉన్న పలు కంపెనీల షేర్లు కూడా ఇవాళ భారీగా పెరిగాయి. అపోల్‌ హాస్పిటల్‌ ఇవాళ నిరాశపర్చింది. ఉదయం రూ. 4900దాటిన ఈ షేర్‌ చివర్లో రెండు శాతం నష్టపోవడం విశేషం. రిలయన్స్‌ కూడా ఇవాళ నిఫ్టి దెబ్బతీసింది. గత కొన్ని రోజులుగా ఆకర్షణీయ లాభాలు గడించిన పేటీఎం, జొమాటో షేర్లు ఇవాళ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. జొమాటొ షేర్‌ దాదాపు అయిదు శాతం నష్టపోయింది. ఆటో రంగ షేర్లలో ఒత్తిడి కన్పించింది.