For Money

Business News

ఎయిర్‌ ఇండియాలో విస్తారా విలీనం

ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేయడానికి విస్తారా ప్రమోటర్లు అంగీకరించారు. విస్తారాలో టాటా సన్స్‌కు 51 శాతం మిగిలిన వావటా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. 2024 కల్లా ఎయిర్ ఇండియా-విస్తారా సంస్థల విలీనం పూర్తవుతుందని టాటా గ్రూప్‌ వెల్లడించింది. విలీనం తరవాత ఎయిర్‌ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ 25.1 శాతం వాటా ఇస్తారు. దీనికిగాను మరో రూ. 2059 కోట్లను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మార్చి 2024 వరకు ఈ లావాదేవీల ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో టాటా సన్స్ సంస్థకు వంద శాతం వాటా ఉండగా, విలీనం తరవాత 75 శాతానికి చేరుతుంది.